
ప్రజాశక్తి-దేవరాపల్లి : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా ఈనెల 20 నుండి 29 తేదీ వరకు జరుగుతున్న బైక్ రాలిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న వి మాడుగుల సిపిఎం మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మంగళవారం దేవరాపల్లిలో దీనికి సంభందించిన పోస్టర్ ను విడుదల చేసి అనంతరం వారు మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలుగు ప్రజలు పోరాడి 32 మంది ప్రాణ త్యాగాలతో, 16 వేల మంది రైతుల 22 వేల ఎకరాల భూత్యాగ ఫలంతో లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న ప్లాంట్ ను రక్షించుకుని తీరతామని స్టీల్ ప్లాంట్ కార్మికులు,ఈ ప్రాంత ప్రజలు గత 1000 రోజులకు పైగా పోరాడుతున్నారని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదన్నారు. దీనిని అమ్మ నియ్యక పోతే మూసి వేస్తామని పార్ల మెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి బెదిరింపులకు పూనుకుంటున్నారని అన్నారు. ఆలస్యం అవుతున్న కొద్ది ప్రజలు, కార్మికులు నిర్సను తగ్గుతాయని ఉద్యమాన్ని ఆపి వేస్తారని మోడీ ప్రభుత్వం భావించిందని కాని వారి అంచనాలకు భిన్నంగా రెట్టింపు ఉత్సాహంతో,పట్టుదలతో కార్మికులు పోరాడుతున్నారని తెలిపారు. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఈ పోరాటానికి విశాల మైన మద్దతు లభిస్తోందని అన్నారు. సిపిఎం ఆది నుండి ఈ పోరాటంలో తన వంతు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 20 నుండి 29 వరకు ఉత్తరాంధ్ర లో బైక్ యాత్ర చేపాట్టిందని తెలిపారు. 20 న విశాఖ జి వి యం సి స్టీల్ దీక్ష శిబిరం వద్ద యాత్ర ప్రారంభించి 29న కూర్మన్నపాలెం స్టీల్ దీక్షా శిబిరం వద్ద వేలాది మందిలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుందని ఉత్త రాంధ్ర ప్రజలు బైక్యాత్రను, బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలమని అన్నారు. దీనికి భిన్నంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి,పార్టీలు ఏదో మొక్కుబడిగా కార్మికుల పోరాటంలో తామూ ఉన్నామని మోసపుచ్చడం తప్ప నిజాయితీగా కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయాన్ని అడ్డుకోవడం లేదన్నారు. అధికార వైసిపి అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకుందని ఇటువంటి పరిస్థితిలలో ప్రజలే స్వచ్చందంగా పోరాటానికి సిద్ధం అయ్యి స్టీల్ ప్లాంట్ ను రిక్షించుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్రలో పాల్గోనాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పి బన్ను, సన్ని బాబు, సూర్యనారాయణ దేముళ్ళు తదితరులు పాల్గొన్నారు.