Sep 22,2022 11:05

ప్రజాశక్తి-మాడుగులు : రావికమతం మండలాల సరిహద్దు గ్రామాల్లో ఉర లోవ రెవెన్యూ గ్రామం కొమిరి ఆదివాసీ గిరిజనులకు 19 మందికి 35 ఎకరాల్లో డి-పట్టా ఇచ్చారు. గత 40 సంవత్సరాల నుండి జీడి తోటలు ఆధారంగానే ఆదివాసీ గిరిజనులు బ్రతుకుతున్నారు. ఆదివాసీ గిరిజన తోటల్లో  సర్వే నెంబర్ 1లో 45 ఎకరాలకు శ్రీ లక్ష్మీనరసింహ గ్రానైట్ కంపెనీకి లీజులు మంజూరు చేశారు. ఈ భూములు గిరిజనులు ఖాళీ చేసేందుకు స్థానిక రెవెన్యూ అధికారి మాడుగులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కయి గిరిజనుల్లో వీడు తోట లాగే చేసుకోవాలని పథకం వేశారు. ఈ పథకాన్ని ఆదివాసులు తిప్పి  కొట్టడంతో 3 నెల క్రితం నర్సీపట్నం ఆర్డీవో సందర్శించారు. కానీ నేటికి మైనింగ్ లీజులు రద్దు చేయకపోవడంతో వచ్చేనెల 21, 22 ఎమ్మార్వో  కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికైనా జిల్లాజాయింట్ కలెక్టర్ సందర్శించి వాస్తు పరిస్థితిని తెలుసుకొని గిరిజనులు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సోలంరాజు, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ch సూరిబాబు, సోలo సత్యవతి, S లక్ష్మి, ఆదివాసి గిరిజన  లబ్ధిదారులు పాల్గొన్నారు.