Oct 07,2023 11:23

ప్రజాశక్తి - కురుపాం : స్కూటీతో ఆగి ఉన్న వ్యక్తికి లారీ ఢీకొని మృతి చెందిన సంఘటన శనివారం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రమైన కురుపాంలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ప్రకారం మండల కేంద్రంలో గల ఆఫీసల్  కాలనికి చెందిన కొచ్చర్ల నారాయణరావు (52). మెయిన్ రోడ్డు పక్కన తన స్కూటీ మీద కూర్చుని ఆగి ఉన్న సందర్భంలో పార్వతీపురం నుండి కురుపాం సమీపంలో కర్రల లోడు నిమిత్తం వస్తున్న లారీ స్కూటీని  బలముగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన రోడ్డు మీద పడి ఉన్న సమయంలో డ్యూటీ నిమిత్తం గుమ్మలక్ష్మీపురం మండలం వెళ్తున్న జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంతెన వినోద్ కుమార్ సంఘటనా స్థలంలో ప్రధమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి 108 అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.