ప్రజాశక్తి-జి సిగడాం : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా డ్వామా పీడీ జి.వి చిట్టి రాజు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆదివారం జి. సిగడాం మండల పరిధిలో గల సంతవురిటి, పాల ఖండ్యాం, గేదెల పేట గ్రామల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పచ్చదనం పెంపొందించేందుకు ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఉపాధి హామీ సిబ్బందికి మొక్కల పెంపకాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. పచ్చదనం పెరిగినప్పుడే గాలిలో ఆక్సిజన్ పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డ్వామా పిడి జి.వి చిట్టి రాజు, ఎపిఓ చోళ్ల సత్యనారాయణ, ఈసి గేదెల పురుషోత్తం, సర్పంచ్ ప్రతినిది ధారబోయిన దర్మారావు, నర్సింగ రావు,టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు , వేతన దారులు పాల్గొన్నారు.










