Nov 22,2020 12:09

కొన్ని అక్షరాలను
ఏరుకుని
దారపు పోగులుగా
అల్లుతుంటాను

కొన్ని అక్షరాలను
వెతికి
సూది మొనలుగా
మలుస్తుంటాను

కొన్ని అక్షరాలను
పట్టుకుని
కత్తెరెలుగా
తయారీ చేస్తుంటాను

కొన్ని అక్షరాలను
కూడపెట్టి
ఔషధంగా
సిద్ధం చేస్తుంటాను

వాటన్నింటితో
గాయాలతో
జబ్బుపడ్డ వ్యవస్థకు
శస్త్ర చికిత్స చేస్తుంటాను

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791239