- ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు, పవైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు
ప్రజాశక్తి - హెల్త్ యూనివర్శిటీ : మారుతున్న జీవనశైలితో పాటు ఒత్తిడి తదితర కారణాలతో ఇటీవల కాలంలో గుండె సమస్యలు పెరిగిపోతున్నాయని పలువురు ప్రముఖులు అన్నారు. నగరంలోని హోటల్ వివంతలో శనివారం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ (ఐఎఐసిఎస్) ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివ శంకరరావు ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ శివ శంకరరావు మాట్లాడుతూ ప్రజలకు గుండె సంబంధ సమస్యలపైన, ఆధునిక చికిత్సలపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైద్య చికిత్సలో ఎప్పటికప్పుడు అత్యాధునిక పద్ధతులు వస్తున్నాయన్నారు. కార్డియాక్ సర్జరీలోనూ అత్యాధునిక పద్దతులు వచ్చాయని తెలిపారు. అతిథిగా పాల్గొన్న వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం వరకూ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవన్నారు. ఇటీవల కాలంలో నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయన్నారు. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులు పెరిగాయని, ఇవి 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉన్న వయస్సు వారికీ రావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్ ద్వారా 63 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, వీటిలో 32 శాతం గుండె సంబంధ సమస్యలు కారణంగా ఉంటున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో జీవనశైలిలో మార్పులు చేసుకుని మంచి అలవాట్లను పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికీ మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ మెడిసిన్ కాన్సెప్ట్‌ను ప్రారంభించిందన్నారు. ప్రముఖ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య విదానంలో గుండె చికిత్స అందించేందుకు ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్టులు ఎంతో దోహదపడతారని తెలిపారు. విజయవాడ కేంద్రంగా తొలిసారిగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్టుల పాత్ర, కార్డియాలజిస్టుకు, కార్డియో సర్జన్స్‌కు మధ్య తేడా ఏమిటన్నది దీని ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇంటర్‌వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ గురించి తమ అసోసియేషన్ ద్వారా విస్రృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
- ఇంటర్‌వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ గుంటూరు వరుణ్ ఎన్నిక
ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్‌గా విజయవాడకు చెందిన ప్రముఖ గుండె శస్త్ర చికిత్స వైద్యులు డాక్టర్ గుంటూరు వరుణ్ ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా ముంబాయికి కెందిన డాక్టర్ జైనుల్లాబెడెన్ హమ్‌దులే, ఉపాధ్యక్షులుగా కొయంబత్తూరుకు చెందిన డాక్టర్ ప్రశాంత్ వైజయంత్, జాయింట్ సెక్రటరీగా బిలారుకు చెందిన డాక్టర్ సుర్‌ప్రీత్ చోప్రా ఎన్నికయ్యారు. మంగుళూరుకు చెందిన డాక్టర్ జయకృష్ణన్, చెన్నరుకు చెందిన డాక్టర్ జస్వంత్ ముప్పాల, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అభిజిత్ ఎం దసీట్‌వార్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికయ్యారు.a