ప్రజాశక్తి-కాకినాడ : అపోలో హాస్పిటల్స్ కాకినాడ వద్ద కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలో నూతన వరవడి సఅష్టించామని సీఈవో ఐ. వి.రమణ తెలిపారు. ఈ మేరకు ఐ .వి. రమణ మాట్లాడుతూ ... కాకినాడ అపోలో హాస్పిటల్ లో 8వ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేసి డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు. ఈ ఎనిమిదవ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ వరకు పూర్తిగా అపోలో కాకినాడలోని డాక్టర్లతో మాత్రమే చేసామన్నారు. ఈ ఎనిమిదవ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలో ముఖ్యమైన అవయవదానం కిడ్నీదానం చేసేవారి శస్త్ర చికిత్స పూర్తిగా లాపరోస్కోపిక్ ద్వారా జరిగిందని తెలిపారు. ఈ లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా కిడ్నీ దానం ఇచ్చే వారికి చాలా సులభతరం అవడం ముఖ్యంగా కోత లేకండా కిడ్నీని లేపరోస్కోపిక్ ద్వారా బయటకు తీయటం, రక్తస్రావం అతి తక్కువ కావటం, అతి తక్కువ నొప్పి ఉండటం, కిడ్నీ దాత అతి త్వరగా కోలుకొనే వీలుండడం, హాస్పిటల్ నుంచి అతి తక్కువ రోజులలో డిశ్చార్చి అయ్యే వీలు కలగటం, కోత లేకుండా వుండడం ఇవన్ని లేపరోస్కోపిక్ సర్జరీ ద్వారా నెరవేర్చవచ్చని అన్నారు. కాకినాడ అపోలో హాస్పిటల్స్ లోని ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ డాక్టరు జి.వి.రావు, డా. మణికంఠన్, యూరాలజిస్ట్, డా. కరుణాకర్ రెడ్డి, అనస్థీషియా డాక్టర్ డా. పి. నాగేశ్వరరావు, డా. శర్మిష్ట పాణిగ్రాహి, ట్రాన్స్ ప్లాంట్ ఫిజిషియన్ డా. పి. తేజకృష్ణ, ఎం.డి., డి.ఎం., బఅందం శస్త్ర చికిత్స నిర్వహించారన్నారు. ఆగస్టు 13న అవయవదానం దినోత్సవం సందర్భంగా ఈ సర్జరీ జరగటం అదే రోజు షేషెంట్ డిశ్చార్జి అవటం విశేషమన్నారు. ఈ సందర్భంగా అపోలో కాకినాడ ట్రాన్స్ ప్లాంట్ టీమ్ డాక్టర్లను సిఇఒ ఐ.వి. రమణ, ఇతర డాక్టర్లందరూ అభినందించారు. ఈ లేపరోస్కోపిక్ సర్జరీ ద్వారా సర్జరీ జరిగిన, కిడ్నీ దానం చేసిన మహిళ అచ్యుతాపురం గ్రామానికి చెందిన పేరు లాలం అచ్ఛయమ్మ కాగా ఆమె వయస్సు 53 సంవత్సరాలు అన్నారు. అచ్చయమ్మ తన కుమార్తెకు కిడ్నీ దానం చేయటం జరిగిందన్నారు. కిడ్నీ దానం చేసిన మహిళను హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, మేనేజ్మెంటు అభినందించారు.