ప్రజాశక్తి-కారంచేడు : బాపట్ల జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామపంచాయతీ సర్పంచి గేరా రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి గేరా కోటేశ్వరరావు (70)మంగళవారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వలన వైద్య చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆయన మృతి చెందడంతో రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబం విషాద ఛాయలో మునిగిపోయింది. ఈ సందర్భంగా పర్చూరు నియోజకవర్గ వైసీపీ మాజీ ఇంచార్జి రావి రామనాథం బాబు, ఇంకొల్లు వైసీపీ నాయకులు మాజీ ఎంపీపీ భవనం శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రముఖులు కోటేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కోటేశ్వరరావు అంత్యక్రియలు బుధవారం సాయంత్రం దగ్గుబాడులో జరగనున్నాయని సర్పంచ్ కుటుంబ సభ్యులు తెలిపారు. కోటేశ్వరరావు గతంలో పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాను, ఏఈఎల్ సి సీనియర్ డెలిగేటుగాను పనిచేశారు. ఆయన మృతి పట్ల దగ్గుబాడు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.










