Jan 04,2023 12:44

ప్రజాశక్తి- బుచ్చయ్యపేట : రైతులు దళారులను నమ్మవద్దని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మరిసా నాని కోరారు. బుధవారం రాజాం రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించొద్దన్నారు. నీలకంఠపురం సర్పంచ్ పడాల నాగభూషణం మాట్లాడుతూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏ గ్రేడ్ రూ.2060లు, సాధారణ రకం రూ.2040లు మద్దతు ధర లభిస్తుందన్నారు. సేకరించిన ధాన్యానికి 21రోజుల్లో రైతు ఖాతాలో జమ చేస్తారన్నారు. కర్రి నాయుడు బాబు, ఎంపీఈఓ సంతోష్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీధర్, రైతులు పాల్గొన్నారు