ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలోని తేజ డివిఆర్ కళాశాలలో భోగి పండ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈరోజు తేజ డివిఆర్ కళాశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించి పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందజేసినట్లు కళాశాల చైర్మన్ ఆళ్ళ రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా తేజ డివిఆర్ కళాశాల చైర్మన్ ఆళ్ళ రాంబాబు మాట్లాడుతూ తేజ డివిఆర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు మరియు విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజ డివిఆర్ కళాశాల ప్రిన్సిపల్స్ ఆదామ్ వలీ, సిరివెళ్ల శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు షేక్ బాజీ షరీఫ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










