May 21,2023 16:37

ప్రజాశక్తి-బాపట్ల : శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని, గుంటూరు వారి సహకారంతో,  చిన్మయా  మిషన్, పర్చూరు వారు జూనియర్ కాలేజీ  ఆవరణలో నిర్విహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 360 మందికి కంటి శుక్లముల పరీక్షలు నిర్వహించగా, 262 మంది శస్త్ర చికిత్సకు ఎన్నిక అయ్యారు. వీరు  అందరికి శంకర కంటి ఆసుపత్రిలో ఉచితంగా ప్రయాణం, భోజన వసతులతో శుక్లముల శస్త్ర చికిత్స నిర్వహిస్తారు అని నిర్వాహకులు పాబోలు ఉదయ భాస్కర్ చెప్పారు. వారి తల్లి తండ్రులు పాబోలు రాధా కృష్ణ మూర్తి, ఇందిరాదేవి జ్ఞాపకార్థం ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఉదయ భాస్కర్ తెలియ చేసారు. ఈ శిబిరంలో డాక్టర్ షాయీజా, డాక్టర్ మెహబూబ్ పి ఆర్ ఓ నాగబాబు, సిబ్బంది వైద్య సేవలు  అందించారు. శిబిరంలో కాసా అజయబాబు, కొసనా వెంకటేశ్వర్లు, కటారి సత్యం, తాటి లింగేశ్వరరావు, గుండిమెడ ఆంజనేయ రావు, కొత్తూరి వెంకటేశ్వరరావు, సుబ్బారావు, దుర్గ ప్రసాద్, రావి  నాగయ్య, అమర్ బాబు, శంకర్‌, రోటరీ సభ్యులు సేవలు అందించారు