Feb 04,2021 00:05

కార్మికులతో మాట్లాడుతున్న నాయినిబాబు

ప్రజాశక్తి-కె.కోటపాడు
కె.కోటపాడు మండలం ఆనందపురంలో సిపిఎం బలపర్చిన గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రొంగలి ముత్యాలనాయుడును గెలిపించాలని గ్రామంలో ఇంటింటికీ తిరిగి బుధవారం ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు, రైతుల భూముల ఆన్‌లైన్‌ చేయించడం, వికలాంగులు, వృద్ధులు, వింతంతు పెన్షన్ల కోసం ముత్యాలనాయుడు చేస్తున్న కృషిని ఓటర్లకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. రైవాడ నీరు రైతులకే ఇవ్వాలని, రైతు సంఘం ఆధ్వర్యాన 170 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పైపులైన్‌ నిర్మాణాన్ని అడ్డుకున్నామని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గండి నాయినిబాబు, గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యర్రా దేవుడు పాల్గొన్నారు.