
కె.కోటపాడు : మండలంలోని కోరువాడ రెవెన్యూ పరిధిలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను కెవిపిఎస్ జిల్లా నాయకులు జి.ప్రసాద్, సిపిఎం నాయకులు ఎర్ర దేవుడు, కె.గోవిందరావు పరిశీలించారు. ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని, ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేయాలని 2020 సెప్టెంబర్ 26న అనకాపల్లి ఆర్‌డిఒకు ఫిర్యాదు చేసి మూడు నెలలవుతున్నా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆక్రమించుకున్నవారిపై దర్యాప్తు చేయాలని, మిగిలిన భూమిని కోరువాడ గ్రామస్తులకు కేటాయించాలని, మిగిలిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రైతు బజార్‌కు స్థలం కేటాయించాలని, శీతల గిడ్డంగులు కట్టాలని డిమాండ్‌చేశారు.