
పెనుమంట్ర (పశ్చిమ గోదావరి) : ప్రత్యేక హౌదా, విభజన హామీల అమలులో రాష్ట్రాన్ని దగా చేసిన మోడీ సర్కార్ ను ప్రజలు నిలదీయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కేతా గోపాలన్ అన్నారు. సిపిఎం రాజకీయ ప్రచార యాత్ర మంగళవారం పెనుమంట్ర మండలం జుత్తిగలో ప్రారంభమైంది. మల్లిపూడి మీదుగా ఎస్‌ఐపర్రు, అత్తిలి మండలం పాళీ, అత్తిలి, మంచిలి మీదుగా తిరిగి పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరం శివారు పంపనవారిపాలెం మీదుగా గరువు, మాముడూరు, పెనుమంట్రతో యాత్ర ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఆకుల హరేరామ్, మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు, మండల కమిటీ సభ్యులు చింతపల్లి లక్ష్మి కుమారి, చింతపల్లి అప్పారావు, బత్తుల విజయకుమార్, నేతల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.