Oct 20,2023 09:29

వరుసగా 11 పాయింట్లు సాధించి క్వార్టర్స్‌లోకి..
డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌500
ఒడెన్సె(డెన్మార్క్‌): డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌500 మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి పివి సింధు ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ఫైనల్లో సింధు 18-21, 21-15, 21-13తో 7వ సీడ్‌, గ్రెగోరియో మరిస్కాపై సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా మూడో గేమ్‌లో సింధు వరుసగా 11 పాయింట్లు సాధించి మ్యాచ్‌ను ముగించడం విశేషం. తొలి రెండు గేమ్‌లను ఇరువురు ఒక్కోటి గెలుచుకోగా.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు 10-13తో వెనుకబడింది. ఆ దశలో వరుసగా 11పాయింట్లు సాధించి ఆ గేమ్‌ను 21-13తో ముగించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో సింధు.. థారులాండ్‌కు చెందిన కంటేథోంగ్‌తో తలపడనుంది. మరో పోటీలో కంటేథోంట్‌ 21-18, 21-8తో భారత్‌కు చెందిన ఆకర్షీ కశ్యప్‌ను చిత్తుచేసింది.