
ప్రజాశక్తి-అనకాపల్లి : సాహితి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కేజీహెచ్, ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాదిరెడ్డి రాజబాబు, సమ్మెంగి అప్పారావు, సింగంశెట్టి నూకి నాయుడు, రామేశ్వర్, పిల్ల సంతోష్ కుమార్ బాధితులను ఈరోజు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము పరామర్శించి, బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఇందులో పిల్ల సంతోష్ కుమార్ తప్ప మిగతా నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వీరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టి కార్మికుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రమాదకర పరిశ్రమలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు రద్దు చేయాలని అచ్యుతాపురం కేంద్రంగా వంద పడకల ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ కు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.