Oct 20,2023 22:18

డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
ఓడెన్సె(డెన్మార్క్‌): డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి పివి సింధు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సింధు 21-19, 21-12తో సుపరింద(థారులాండ్‌)పై వరుససెట్లలో విజయం సాధించింది. తొలి గేమ్‌ను హోరాహోరీ పోరులో నెగ్గిన సింధు.. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్‌ సుమారు 47నిమిషాలసేపు సాగింది. ఈ టోర్నమెంట్‌లో మిగిలిన ఏకైక భారత షట్లర్‌ సింధు మాత్రమే. మరో క్వార్టర్‌ఫైనల్లో మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణి మారిన్‌ 19-21, 21-15, 21-18తో టాప్‌సీడ్‌ తైజుాయింగ్‌(తైపీ)ను ఓడించి సెమీస్‌కు చేరింది.