Jul 11,2022 06:55

సాహిత్య రంగంలో అనువాదం కీలకమైన పాత్ర పోషిస్తోంది. వివిధ ప్రాంతాల్లో, భాషల్లో వెలువడుతున్న పుస్తకాలు స్థానిక భాషలోకి మారి, అక్కడి పరిస్థితులను మనం అర్థం చేసుకోవటానికి, ప్రపంచవ్యాప్త సాహిత్యంతో మమేకం కావటానికి దోహదపడుతుంది. ఇంతకుముందు అనువాదకులు అంటే పురుషుల పేర్లే ఎక్కువ వినిపించేవి. ఇటీవల మహిళలూ ఎక్కువగా అనువాదాలు చేస్తున్నారు. తెలుగు - హిందీ భాషల మధ్య వారథిగా శాంతసుందరి పేరెన్నికగన్నారు. ఇటీవలే సజయకు అనువాదంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆరవ మహాసభల సందర్భంగా ఈనెల 9, 10 తేదీల్లో గుంటూరులో 'అనువాద సాహిత్యం-స్త్రీ సందర్భం' సదస్సు నిర్వహించారు. ఈ ప్రాంగణానికి వి. శాంతసుందరి, దాసరి శిరీష పేర్లు పెట్టారు. సదస్సుకు విచ్చేసిన అనువాదకుల మనోభావాలు ఇవీ :

       నేను వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని. పదేళ్ళుగా అనువాదాలు చేస్తున్నాను. ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల నుంచి చేస్తుంటాను. ప్రస్తుతం ప్రఖ్యాత ఉర్దూ రచయిత, సాదత్‌ హసన్‌ మంటో రచనలు తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. అవి త్వరలో పుస్తకాలుగా రాబోతున్నాయి. అనువాదాల్లో స్త్రీ దష్టి కోణం ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. మంటో 600లకు పైగా కథలు, వందల సంఖ్యల్లో వ్యాసాలు, నాటకాలు, బయోగ్రఫికల్‌ స్కెచెస్‌ రాశాడు. వాటిల్లో ఏ రచనలు, ఎలాంటి రచనలు తెలుగులోకి తీసుకురావాలనే నా ఎంపిక, నేను స్త్రీ అనే దృష్టి కోణంపై ఆధారపడుతుంది. మంటోని ఒక సున్నితమనస్కుడిగా, ఆలోచనాపరుడుగా, అన్నింటికన్నా మించి తప్పొప్పులున్న ఒక మనిషిగా తెలుగువారికి నేను పరిచయం చేసే ప్రయత్నంలో స్త్రీగా నా ప్రాపంచిక దృష్టి, మనోదృష్టి రెండూ దోహదపడతున్నాయి.
                       సాహిత్య రంగంలో అనువాదం కీలకమైన పాత్ర పోషిస్తోంది. వివిధ ప్రాంతాల్లో, భాషల్లో వెలువడుతున్న పుస్తకాలు స్థానిక భాషలోకి మారి, అక్కడి పరిస్థితులను మనం అర్థం చేసుకోవటానికి, ప్రపంచవ్యాప్త సాహిత్యంతో మమేకం కావటానికి దోహదపడుతుంది.         - పూర్ణిమ తమ్మిరెడ్డి, బెంగళూరు

          నేను 2019లో అనువాదం మొదలుపెట్టాను. మలయాళీ రచయిత్రి అమ్మూ నాయర్‌ రాసిన 'ఏ బ్రీఫ్‌ అవర్‌ ఆఫ్‌ బ్యూటీ' అనే ఇంగ్లీష్‌ పుస్తకాన్ని 'లిప్తకాలపు స్వప్నం' పేరుతో తెలుగులోకి అనువదించాను. ఇది ఎడ్మండ్‌ థామస్‌ క్లింట్‌ అనే ఏడేళ్ళ బాలుడి జీవిత చరిత్ర. 'యాన్‌ ఎకనమిక్‌ హిట్‌ మాన్‌'ను 'ఒక దళారీ పశ్చాత్తాపం'గా తెలుగులోకి అనువదించిన కొణతం దిలీప్‌, ప్రొఫెసర్‌ ఈచర వారియర్‌ రాసిన 'మెమరీ ఆఫ్‌ ఏ ఫాదర్‌' పుస్తకాన్ని 'నాన్న' పేరుతో తెలుగులోకి అనువదించిన సి.వనజ నాకు నచ్చిన అనువాదకులు. సొంత రచన చేయడం సాఫీగా, సులువుగా ఉంటుంది. అనువాదం కాస్త క్లిష్టమే అయినా, ఇష్టపడతాను. బాగా చదివితే బాగా రాయగలం అనే సూత్రాన్ని నమ్ముతాను. అనువాదం చేయడానికి ముఖ్యంగా మనకు, రెండు భాషల పట్ల మంచి పట్టు ఉండాలి. వొకాబ్యులరీ బాగా తెలిసి ఉండాలి.
                    సాహిత్య రంగంలో అనువాదం కీలకమైన పాత్ర పోషిస్తోంది. వివిధ ప్రాంతాల్లో, భాషల్లో వెలువడుతున్న పుస్తకాలు స్థానిక భాషలోకి మారి, అక్కడి పరిస్థితులను మనం అర్థం చేసుకోవటానికి, ప్రపంచవ్యాప్త సాహిత్యంతో మమేకం కావటానికి దోహదపడుతుంది.            - స్వర్ణ కిలారి, హైదరాబాద్‌

మొదట ఆటవిడుపుగా అనువాదాలు మొదలు పెట్టాను. ఇప్పటికీ అనువాదం నా తొలి ప్రాధాన్యత కాదు, కానీ అనువాద అనుభవం నన్ను సంపద్వంతం చేసింది. అనువాదం చేసేపుడు, అక్షరమక్షరం విడి విడిగానూ, మొత్తం రచనని కలిపి చూడటంలోనూ ఆయా రచయితల చాతుర్యం, వారి హృదయం, కనిపెట్టేసిన వింత భావన. అనువాదాలు నన్ను పాఠకురాలి స్థాయి నుంచి, కాస్త మంచి పాఠకురాలిని చేసాయి. మలంపంబన్‌ అనే మలయాళ కథ ఇంగ్లీషు అనువాదాన్ని తెలుగులోకి తెచ్చిన అనుభవం ఊపేసింది. ఇప్పటికీ మలంపంబన్‌ నాతోనే ఉన్నాడు. 'స్త్రీల అనువాద సాహిత్య చరిత్ర' పరిశోధన చేయాలని నా వ్యక్తిగత ఆసక్తి
                    సాహిత్య వారధులు అనువాదకులు         - కె. ఎన్‌. మల్లీశ్వరి, విశాఖపట్నం

నేను అనువదించిన 'ఊరికి దక్షిణాన' నవల అనువాద ఛాయలు లేకుండా ఉందని సాహితీ పెద్దలు ప్రశంసించారు. గౌరీ కృపానందన్‌ నాకు నచ్చిన అనువాదకులు. తమిళం నుంచి తెలుగులోకి ఎన్నో కథలు, నవలలు అనువదించారు. పాత్రకి తగ్గట్టు తెలుగు యాసని ఆవిడ రాయడం వల్ల తెలుగు దనం సంతరించుకుని తెలుగు కథలే చదువుతున్నట్టు ఉంటుంది. ప్రరవే అనువాద సదస్సు గొప్ప సందర్భం. ప్రొఫెసర్‌ సునీత రాణి, బి.అనురాధ, అరుణ గోగులమండ, అపర్ణ తోట, ఎన్‌.వేణు, యాజ్దానీ లాంటి చురుకైన గొంతులు ప్రరవే వేదిక మీద మాట్లాడ్డం, గుంటూరు డిగ్రీ, పీజీ విద్యార్థినులు హాజరు కావడం, వేదిక మీద మాట్లాడ్డం ఒక చైతన్యాన్ని కలిగించింది.
                    Normalised or structured violence “ gender minorities           - మానస ఎండ్లూరి, హైదరాబాద్‌

PARIలో వచ్చిన news stories అనువదించాను. నాకు నచ్చిన అనువాదకులు అట్లూరి పిచ్చేశ్వర్రావు. అనువాదం అంటే మక్కికి మక్కి చేయడం కాదు. అర్థం చేసుకుని తిరగరాయడం సరైన పని. అనువాదాల్లో స్త్రీ దష్టి కోణం తప్పకుండా ఉంటుంది. Normalised or structured violence “ gender minorities గుర్తించి పట్టుకున్నట్లు మగవారు చేయలేరు.
                         Normalised or structured violence “ gender minorities        - అపర్ణ తోట, హైదరాబాద్

పదహారో ఏట నుంచి అమ్మ శర్వాణి కన్నడం నుంచి తెలుగులోకి చేసిన అనువాదాలకు మేలుప్రతి తయారు చేసి ఇవ్వడంతో నాకు అనువాద ప్రక్రియతో పరిచయం ఏర్పడింది. క్రమేణా అలవాటు అయింది. నచ్చిన అనువాదకులు రెంటాల గోపాలకృష్ణ, అట్లూరి పిచ్చేశ్వర్రావు, మద్దిపట్ల సూరి, తెన్నేటి సూరి, బొందలపాటి దంపతులు, తిరుమల రామచంద్ర, ఆర్వీయార్‌ రంగనాథ రామచంద్ర ఈ లిస్టు అనంతం. స్వంత రచనల్లో ఉన్న స్వేచ్ఛ అనువాద ప్రక్రియలో ఉండదు. కొత్త అనువాదకులకు రచన పట్ల objectivity  ఉండాలి. పరాయి భాషలోకి వెళ్తున్న రచన మూల రచనకు ప్రతిబింబం కావాలి. అనువాదకుల అభిప్రాయాలు భావనలు అనువాదంలో చొరబడకూడదు. అనువాదాలకు, రచనలకు జెండర్‌ కోణం లేకపోతేనే అవి నిష్పక్షపాతంగా జడ్జ్‌ చేయగలుగుతాము. జీవితంలో ఉన్న కోణాలు, సంబంధాలు, సమస్యలు అన్నీ రచనల్లో చోటు చేసుకుంటాయి. రచన judgemental గా ఉండకూడదని నమ్ముతాను.
                          సాహిత్య వారధులు అనువాదకులు    - కల్యాణి నీలారంభం, బెంగళూరు

వివిధ విద్యాసంస్థల్లో అధ్యాపక వృత్తిలో ఉండి రిటైరయ్యాను. కేవలం అనువాదాలే కాకుండా అనేక ప్రక్రియల్లో రచనా ప్రవేశం ఉంది. అనువాదాల్లో స్త్రీ దృష్టి కోణమని వుండదు. అనువాద సాహిత్యం మీద ఇంత విస్తృతమైన సదస్సు జరిపిన ప్రరవేకి అభినందనలు.
                             సాహిత్య వారధులు అనువాదకులు    - కల్లూరి శ్యామల, విశాఖపట్నం.

పుస్తకాల అనువాదం 2013 నుంచి మొదలు పెట్టాను. మొట్టమొదటి పుస్తకం బేబీ కాంబ్లే ఆత్మకథ. ఆవిడ మరాఠీ దళిత కార్యకర్త. ఈ పుస్తకాన్ని తెలుగులో చాలా ఆదరించారు. అనువాదం చేస్తున్న విషయాలు మన హృదయానికి దగ్గరగా ఉన్నవి అయినప్పుడు, మనం వాటితో ఐడెంటిఫై అయినప్పుడు వాటికి ఎక్కువ న్యాయం చేయగలుగుతాము. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పెట్టిన అనువాద సదస్సు వల్ల ఎందరో అనువాదకులు ఒక దగ్గర కలిశారు.
                     Normalised or structured violence “ gender minorities        - బి.అనురాధ, హైదరాబాద్‌

నావరకూ నాకు అనువాదం కన్నా సొంత రచన చేయడం ఇష్టం. నా గొంతుక వినిపించడానికి నా వాక్యాన్ని నమ్ముకుంటాను. అయితే, 'ఇలాంటి కవిత్వం, ఇలాంటి కథా, ఇంత గొప్ప నవలా ఇప్పటిదాక తెలుగులో రాలేదు' అనుకున్నవి మాత్రం కచ్చితంగా అనువాదం కావాల్సిందే. అనువాదం చేయడానికి రెండు భాషల మీదా పట్టు వుండాలి. మూల రచనలోని ఆత్మనీ, రచన నేపథ్యాన్ని, అక్కడి సాంస్క ృతిక మూలాల్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే అనువాదం నిర్జీవంగా అనిపిస్తుంది. తమిళ, కన్నడ, మలయాళ సాహిత్యం చాలా గొప్పగా అనేక సమస్యల్ని చర్చిస్తోంది. అది మన దగ్గరా జరగాలి.
                     సాహిత్య వారధులు అనువాదకులు            - ఉమా నూతక్కి, మంగళగిరి

                                                                         రిపోర్టు : శాంతిశ్రీ