
- ఆర్థిక సాయం అందే మార్గాలను కూడా మూసివేయాలి
బెనాలిమ్ (గోవా) : సరిహద్దు ఆవలి తీవ్రవాదంతో సహా ఏ రూపంలోని తీవ్రవాదానైునా నిర్మూలించాల్సిందేనని విదేశాంగ మంత్రి జై శంకర్ అనాురు. తీవ్రవాద కార్యకాలాపాలకు ఆర్థిక సాయం అందే మార్గాలను కూడా మూసివేయాల్సిందేనన్నారు. గోవాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సుకు అధ్యక్షత వహించిన ఆయన శుక్రవారం మాట్లాడారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిల్వాల్ భుట్టో సమక్షంలోనే ఆయన తీవ్రవాదంపై తమ వైఖరిని గట్టిగా వినిపించారు. ఒకపక్క ప్రపంచం కోవిడ్ మహమ్మారితో, తదనంతర పర్యవసానాలతో సతమతమవుతునాు కూడా తీవ్రవాద ముప్పు అడ్డూ అదుపు లేకుండా సాగిందని విమర్శించారు. పరోక్షంగా పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం నుండి దృష్టి మళ్ళించడం వల్ల భద్రతా ప్రయోజనాలకువిఘాతం కలుగుతుందని హెచ్చరించారు. తీవ్రవాదానికి ఎలాంటి సమర్ధింపు వుండరాదని భారత్ ధృఢంగా విశ్వసిస్తోందన్నారు. ఈ ముప్పును ఎదుర్కొనడమనేది ఎస్‌సిఓ ఆదేశాల్లో ఒకటనిఆయన పేర్కొనాురు. ప్రగతికి అనుసంథానత అనేది చాలా కీలకమని ఆయన నొక్కి చెప్పారు. అనిు సభ్య దేశాల సార్వభౌమాధికారానిు, ప్రాదేశిక సమగ్రతను తప్పనిసరిగా గౌరవించాలనిఅనాురు. ఈ సమావేశానికి చైనా, రష్యా విదేశాంగ మంత్రులతో సహా ఇతర సభ్య దేశాల విదేశాంగ మంత్రులు కూడా హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులను కూడా జైశంకర్ ప్రస్తావించారు. ఎస్‌సిఓలో సంస్కరణలు తీసుకువచ్చి, ఆధునీకరించాలని, అప్పుడే మరింత సమకాలీన దృక్పథం రావడానికి దోహదపడుతుందని, దానికోసం భారత్ తీవ్రంగా కృషి చేస్తుందనిచెప్పారు. ఇంగ్లీషును ఎస్‌సిఓ మూడవ అధికార భాషగా తీసుకురావడానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటునాుమనిచెప్పారు. ఇప్పటివరకుచైనీస్, రష్యన్‌లు మాత్రమే అధికార భాషలుగా వునాుయి. స్టార్టప్‌లు, వినూతు అన్వేషణలపై, సాంప్రదాయ మెడిసిన్‌పై కొత్తగా రెండు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలను భారత్ ప్రతిపాదనకుసభ్య దేశాలు మద్దతివ్వడానిు ఆయన అభినందించారు. కాగా ఈ సదస్సు సందర్భంగా భారత్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సమావేశం వుండబోదని ముందుగానే చెప్పిన పాక్‌మంత్రి బిల్వాల్‌తో మర్యాదపూర్వకంగా జై శంకర్ కరచాలనం చేశారు.