ప్రజాశక్తి-ఉంగుటూరు : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం-ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కైకరం రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు సమస్యలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం పట్టుబడులకు గోనె సంచులు ఇవ్వాలని, ధాన్యం రవాణాకు లారీలు ఏర్పాటు చేయాలని, నూక శాతం పేరుతో రైతుల నుండి డబ్బులు వసూలు ఆపాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం-కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం, కైకరం రైతు భరోసా కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు.










