న్యూఢిల్లీ : రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం నాటికి రూపాయి విలువ డాలర్‌కు 82.30 వద్ద ట్రేడవుతోంది. గురువారం కన్నా 81.89 నుండి 0.5 శాతానికి తగ్గి.. ఆల్‌టైమ్ కనిష్టానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. రూపాయి శుక్రవారం డాలర్‌తో పోలిస్తే 82.22 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. నేడు ఏకంగా 33 పైసలు పడిపోయింది. ఫెడ్ రేట్ల పెంపులతో అమెరికా విదేశీ డబ్బును భద్రతకు తరలించే క్రమంలో ఈ క్యాలెండర్ సంవత్సరంలో రూపాయి విలువ ఏకంగా 10.6% క్షీణించింది. మొత్తంగా 82 రూపాయిల మార్క్‌ను కూడా దాటేసింది. పెరుగుతున్న చమురు ధరలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపు ప్రచారం కారణంగా ఈ ఏడాది గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే.. రూపాయి రికార్డు కన్నా కనిష్ట స్థాయికి చేరుకుంటుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. డాలర్ ఇండెక్స్, ఆరు కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ ట్రాక్ చేస్తుంది. డాలర్ 0.14శాతం తగ్గి 112.10 వద్ద ట్రేడవుతోంది.










