Mar 02,2023 21:26

ముంబయి : ప్రపంచ మార్కెట్‌లో గత కొద్ది రోజులు స్థిరంగా ఉన్న రూపాయి విలువ ఇటీవల మళ్లీ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. గురువారం సెషన్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు కోల్పోయి 82.60కి పడిపోయింది. ఉదయం 82.57 వద్ద తెరుచుకున్న రూపాయి విలువ 82.60 వద్ద నమోదయ్యింది. ఇంతక్రితం సెషన్‌లో 82.49 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస పతనం, ఎఫ్‌ఐఐలు తరలిపోవడం, ఎగుమతుల్లో తగ్గుదల తదితర అంశాలు రూపాయిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి.