- జర్నలిస్టు తులసి చందుపై బెదిరింపులను ఖండిస్తున్నాం
ప్రజాశక్తి-చీరాల: సమాజంలో ఫోర్త్ పిల్లర్ గా ఉన్న మీడియా వ్యవస్థపై దాడులు చేయటం దుర్మార్గమైన చర్య అని ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూస్తున్న మతోన్మాద దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజా సంఘాల నాయకులు పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవనంలో సీనియర్ జర్నలిస్టు దమ్ము విజయభాస్కర్ అధ్యక్షతన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పై హత్య చేస్తామన్న బెదిరింపులను ఖండించేందుకు "మీడియా స్వేచ్ఛ - అవంతరాలు" అనే అంశంపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రశ్నించే స్వరాలపై మతోన్మాద దాడులు జరుగుతున్నాయని దేశభక్తి అంటే ప్రశ్నించే గొంతులపై దాడి చేయడమేనా అంటూ ప్రశ్నించారు. వాస్తవాలు శక్తుల అరాచకాలు గురించి వార్త కథనాలు ప్రజలలో చైతన్యం కలిగించిన సీనియర్ జర్నలిస్టు గౌరీ శంకర్ ను నాడు తన ఇంటి వద్దనే దుండగులు తుపాకులతో అత్యంత దారుణంగా కాల్చి చంపిన ఘటనలు ఉన్నాయని అన్నారు.నేడు బిజెపి, ఆర్ఎస్ఎస్, కుట్ర పూరిత చర్యలును ప్రజలకు తెలియజేస్తూ వార్త కథనాలను, విశ్లేషణలు ప్రసారం చేస్తూ ప్రశ్నిస్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టు తులసి చందుపై హత్య చేస్తామన్న బెజరింపులను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించాలని చూస్తున్న చీకటి శక్తులను కఠినంగా శిక్షించాలన్నారు.జర్నలిస్టు తులసి చందు పై దాడులు జరిగితే దానికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మాచర్ల మోహన్రావు, గుమ్మడి ఏసు రత్నం, పి కొండయ్య, ఎన్ బాబురావు, యల్ జయరాజు, శీలం వెంకటేశ్వర్లు,గొర్రెపాటి రవి, ఎస్ కే జిలాని, గజవల్లి శ్రీను, మీడియా ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.










