
ప్రజాశక్తి-గుంటూరు : పంచాయతీలు సర్పంచుల సమస్యలపై జనాచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన వక్తగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరైన్నారు. జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ రెడ్డి, పంచాయతీ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం అధ్యక్షులు పాపారావు, జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరైయ్యారు. తమకు నిధులు, విధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచులు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.