
ప్రజాశక్తి - ఆలమూరు (తూర్పు గోదావరి) : విజయదశమి విజయానికి ప్రతీక అని నూతన వ్యాపారం ప్రారంభించే వారంతా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ చెముడులంకలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా దూలం స్వాములు ఏర్పాటు చేసుకొన్న మిల్క్ అండ్ డైరీని వైసీపీ మండల కన్వీనర్, సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... మరింతమంది మరిన్ని వ్యాపార సంస్థలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని స్వశక్తితో వృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా షాపు ఓనర్ దూలం స్వాములుని భవాని మాలదారులు విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదంతో వారి వ్యాపార సంస్థ తప్పక వఅద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దొండపాటి చంటి, అడబాల వీర్రాజు, మోటూరి సురేష్, దొండపాటి శ్రీను, తమ్మన హరి, బర్రా వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.