
ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు మండలం ఉల్లంపర్రు డా.సబిత ఉమెన్స్ జూనియర్ కాలేజీ నందు 'అంతరిక్ష యానంలో నా దేశం' అనే అంశం మీద వక్తృత్వ పోటీలు (ఎలక్యూషన్) కాలేజీ విద్యార్థులుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా రెడ్డప్ప ధవీజీ వ్యవహరించారు. పాలకొల్లు వివిద కాలేజీలు నుండి వచ్చిన విద్యార్థులు ఈ పోటీలలో పాలుగొన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, బహుమతులు అందజేస్తాము అని క్లబ్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్ రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ రావాడ సతీష్, ట్రెజరర్ ముత్యాల ప్రదీప్,పాస్ట్ ప్రెసిడెంట్స్ చందక రాము, మద్దాల రాంప్రసాద్, కటారి నాగేంద్ర కుమార్, రోటరీ సభ్యులు పొతాబత్తుల సత్యనారాయణ, కానూరి ప్రభాకర్, సిరిగినీడి శ్రీరామ నాగర్జునరావు పాలుగొన్నారు.