
ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు రోటరీ క్లబ్ వారి ఆద్వర్యంలో ఉల్లంపర్రు మాoటిస్సోరిస్ స్కూల్ నందు పాలకొల్లు లో ఉన్న ప్రభుత్వ,ప్రవేటు స్కూల్స్ విద్యార్థులుకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు క్విజ్ మాస్టర్ గా సీనియర్ రోటరియన్ షేక్ పీర్ సాహెబ్ పోటీలు ను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తాము అని క్లబ్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ యూత్ సర్వీస్ డైరెక్టర్ మద్దాల వాసు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్ రావు, సెక్రటరి రావాడ సతీష్, పాస్ట్ ప్రెసిడెంట్, చందక రాము, రోటరీ సభ్యులు కానూరి ప్రభాకర్, పోతాబత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.