Jun 25,2023 12:27

ప్రజాశక్తి-చీరాల : సేవా కార్యక్రమాలలో రోటరీ అన్ని వేళలా ముందుంటుందని అందులో భాగంగా మండలంలోని ఈపురిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహిళల అవసరార్థం 10 కుర్చీలను బహుకరిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబురావు అన్నారు. పిహెచ్ సికు వచ్చే మహిళలకు ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార నియమాలు వ్యాయామం పలు అంశాలపై అవగాహన కల్పించి సమయపాలన పాటిస్తూ మందులను తీసుకోవాలని సూచించారు. గర్భిణి స్త్రీలు పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని పసిబిడ్డ ఎదుగుదలకు తల్లి ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో కీలకం కావున తప్పనిసరిగా మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రతినిధి పోలు దాసు రామకృష్ణ, కృష్ణమూర్తి డాక్టర్ శ్రీదేవి, పిహెచ్సి సిబ్బంది పలువురు పాల్గొన్నారు.