
ప్రజాశక్తి-దేవరాపల్లి : దేవరాపల్లి మండల కేంద్రంలో శారదా నది ఓడ్డున శ్మశాన వాటికకు రెల్లివీధి శ్మశానవాటికు వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని, వాలాబు గర్సింగి చింతలపూడి తామారబ్బ పంచాయతీలో పోడు పారెస్టు భూములను పట్టాలు ఇవ్వాలని శుక్రవారం దేవరాపల్లిలో జరిగిన స్పందన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న వినతిపత్రం సమర్పించారు. అనంతరం అయిన వీలేకర్లుతో మాట్లాడారు. దేవరాపల్లిలో దాదాపుగా 18 వేల మంది జనాభా నివశిస్తున్నారని శ్మశానవాటికు కనీసం రహదారి సౌకర్యం లేకపోవడం దుర్మార్గమన్నారు. శారదానది ప్రవాహం వస్తే నది దాటలేక నదిలోనె శవాలను వదిలి పెడుతున్నారని శ్మశానవాటికలో ఎండ అయిన వాన అయిన కనీసం నిలువ నీడలేదన్నారు. రెల్లి వీధికి అయితే మరి అద్వాన్నంగా ఉందని పోలాలు గట్టుపై వెళ్ళలెక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. వాలాబు గర్సింగి గిరిజన గ్రామాలకు గతంలో పోడు పారేస్టు భూములకు అతుకుబడి పట్టాలు ఇచ్చారని అత్యధిక మందికి సర్వే జరిపి వదిలేసారని వీరితో పాటు చింతలపూడిలో వీరబద్రిపేట కోరాడ నేరెళ్ళపూడి బోడిగరువు తామరబ్బలో పళ్ళపు కోడాబు కోండకోడాబు గ్రామాల్లో అత్యదిక మంది గిరిజను పోడు పారేస్టు భూములు సాగు చేస్తున్నారని వెంకటరాజుపురం మారేపల్లి గర్సింగి వాలాబు తామరబ్బ చింతపూడి పంచాయతీల్లో బంజరు భూములు సాగు చేస్తున్నారని వెంటనే సర్వే జరిపి అసైన్డ్ చేసి అతుకుబడి పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు వెంకన్న విన్నవించారు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తామని హమి ఇచ్చారు.