Jul 28,2023 15:52

ప్రజాశక్తి-యద్దనపూడి(బాపట్ల) : యద్దనపూడి నుండి పర్చూరు వెళ్లే రహదారి దారుణంగా తయారయింది వాహనం ఎదురొచ్చింది అంటే మరొక వాహనము పక్కకు తప్పుకోవడానికి అవకాశం లేదు రోడ్డు సైడ్ రెండు అడుగుల గుంటలు, రోడ్డు మధ్యలో మరొక రెండు అడుగులు గుంటలు కలిపి యద్దనపూడి జాగర్లమూడి మధ్య రహదారితీరు ఉన్నది. ఈ రోడ్డుపై టిప్పర్లు విపరీతంగా ప్రయాణం చేయడంతో ఆ రహదారి ఉంది గుంటలు ఏర్పడ్డాయి పగలుపూట ప్రయాణం చేయాలంటేనే దారుణంగా ఉన్నాయి వర్షం పడిందంటే మరి దారుణంగా ఉన్నది. నరకప్రాయంగా ఆ ప్రయాణం ఉన్నదని స్థానిక ప్రయాణికులు, ప్రజలు చెబుతున్నారు. ఈ రహదారిలో ఒక వాహనం వచ్చిందంటే మరో వాహనం వెళ్లడానికి వీలు లేకుండా తయారయింది రోడ్డు పక్కన అప్రోచ్ లేకపోవడం వలన ఎదురు వచ్చే వాహనం తప్పుకొనే వీలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక రెండు నెలల క్రితం మూడు చోట్ల రహదారి మధ్యలో ఉన్న గుంతలను చదును చేసి అలాగే వదిలేశారు. దీంతో మరింత గుంటలుగా తయారైంది. దీనిపై అధికారులు స్పందించి యద్దనపూడి జాగర్లమూడి మధ్య ఉన్న రహదారిని రెండు లైన్లు రహదారిగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.