ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : 216 వ జాతీయ రహదారి తాడేపల్లిగుడెం రూరల్ పెద తాడేపల్లి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటన సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం నాగులపల్లికి చెందిన చవాకుల వీర వెంకటేశ్వరరావు ఆయన భార్య వరలక్ష్మిలు నల్లజర్ల మండలం తెలికిచర్ల వెళ్లేందుకు పల్సర్ బైక్ బయలుదేరారు. వాళ్ళు బాదంపూడి దత్త అశ్రం దాటాక కమ్మ కల్యాణ మండపం సమీపంలో వెళ్లేసరికి రాంగ్ రూట్ లో వస్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చవాకుల వీర వెంకటేశ్వరరావు(45) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోగా ఆమె భార్య వరలక్ష్మికి స్వల్పంగా గా యపడ్డారు. అపశయ్య మార్గం లో బైక్ పై వచ్చిన పడాల వెంకటరత్నం స్వల్పంగా గా యపడ్డారు. సమాచారాన్ని అందుకున్న హైవే సిబ్బంది , పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.










