ప్రజాశక్తి-ఏలూరు : జంగారెడ్డిగూడెంలో తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిపై బైనేరు బ్రిడ్జి పై నుంచి కారు బోల్తా కొట్టింది. జాతీయ రహదారి నుంచి వాగు సమీపంలోకి కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. బ్రిడ్జి సమీపంలో నూతన వంతెన నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. హెచ్చరిక సంకేతాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










