ప్రజాశక్తి: 16వ జాతీయ రహదారి భీమడోలు-గుండుగొలను మధ్యలో ఏలూరు వైపు వెళ్తున్న ఆటోని వెనకనుండి కారు ఢీకొట్టింది. కారు ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో తిరగబడింది. ఆటోలో ప్రయానిస్తున్న 11మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో 7గురిని నలుగురిని హైవే అంబులెన్స్ లో, మిగతా వారిని 108 అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.










