ప్రజాశక్తి-చీరాల: టాక్టర్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని వాడరేవు బైపాస్ రోడ్డులో గురువారం జరిగింది. చీరాల మండలం వాడరేవు గ్రామం పాకల కాలనీ కు చెందిన సాగర్ (18) ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సాగర్ అపస్మారక స్థితిలో చేరుకొని కొద్ది సేపటికే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










