Mar 29,2023 11:20

ప్రజాశక్తి-సీతారాంపురం : ఈ రోజు తెల్లవారుజామున సీతారాంపురం గ్రామ శివారు ఎన్.హెచ్ 16 రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న (mh14 ka 5679) నెంబర్ గల ట్రాలీ లారీని వెనుక నుండి (AP 10Al 6563) నెంబర్ గల వ్యాగన్ కార్ డ్రైవరు బలంగా ఢీకొన్నది. కారులో ప్రయాణం చేయుచున్న విశాఖపట్నం జిల్లా మల్కాపురానికి చెందిన కోల శ్రీనివాసరావు కారు నడుపుతున్నందున పక్కన కూర్చున్న తన భార్య అయిన కోలాభారతి (44) మరియు తన కుమారుడైన కోలా మోహన్ బాలాజీ(8) బలమైన గాయంలతో మరణించినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన నలుగురిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సదరసాములు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామం వద్ద వారి బంధువులు చనిపోయినందున దహన సంస్కారములు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సదరు కారును మృతుల యొక్క తండ్రి నడుపుతున్నట్లు తెలిపారు. సదరు రిపోర్టును సిఐ ఉత్తరం మేరకు ఎస్సై జోగారావు నమోదు చేసి పరీక్ష నిమిత్తం మృతులను నక్కపల్లి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేయుచున్నారు.