- దర్మా కూల్ బాక్స్ పేలి గోపాలమిత్ర శంకర్ మృతి
ప్రజాశక్తి - అంబాజీపేట : అంబాజీపేట పశువైద్యశాల పరిధిలో మాచవరం-3 రైతు భరోసా కేంద్రంలో ఇంచార్జిగా విధులు నిర్వహిస్తున్న గోపాలమిత్ర నౌండ్రు శివశంకర్ (40) మంగళవారం సాయంత్రం విధులు పూర్తిచేసుకుని స్వగ్రామం వాకలగరువు ఇంటికి వస్తుండగా మాచవరం శివారు దొమ్మేటివారిపాలెం సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో బైక్ కు ఉన్న ధర్మ కూల్ బాక్స్ పేలిపోయి తీవ్ర గాయాలు కాగా శస్త్రచికిత్సకు అమలాపురం ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. శివశంకర్ 2006 నుంచి గోపాలమిత్రగా వైద్యసేవలు అందిస్తున్న శంకర్ మృతిని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల ఆయన వెటర్నరీ అసిస్టెంట్ గా పరీక్షలు రాశారు. కుటుంబ బాద్యతలు మోస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఉన్నారు. ఆయన మృతి వాకలగరువు, తొండవరం,నందంపూడి,గున్నేపల్లి గ్రామాల రైతులు అతను సకాలంలో అందించిన సేవలను మననం చేసుకుంటూ దిగ్బాంతి చెందారు. ప్రభుత్వం అతని సేవలను గుర్తించి దిక్కు కోల్పోయిన అతను కుటుంబ సభ్యులకు అండగా ఉండి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని స్థానికుల విన్నవిస్తున్నారు.










