ప్రజాశక్తి-చిత్తూరు : అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, IPS అదేశానుశారం పోలీస్ ఆఫీస్ సిబ్బంది సమక్షంలో చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్.సుధాకర్ విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాల సమస్యల పరిష్కారం కొరకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బముగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీసు కుటుంబాలతో వారి సమస్యలు తెలుసుకొని, పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు చేపడతామన్నారు. మీరంతా పోలీసు కుటుంబంలో సభ్యులేనని, ఎటువంటి అవసరం వచ్చిన తక్షణమే నేరుగా కలవచ్చున్నారు. జిల్లా పోలీసులు మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసు కార్యాలయ పరిపాలన అధికారి కె.ఎం.వి.మోహన్ రావు పోలీసు కుటుంబాలకు ఇప్పటి వరకు వచ్చిన మరియు రావలసిన నగదు వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ. కె.ఎం.వి.మోహన్ రావు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ కుమార్, పోలీస్ కార్యాలయ సిబ్బంది మరియు పోలీస్ కుటుంబాలు పాల్గొన్నారు.










