Jan 25,2023 14:49

ప్రజాశక్తి-నందిగామ : మంగళవారం మృతి చెందిన రిటైర్డ్ టీచర్ దుగ్గిరాల చిన్నప్ప కు   ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నివాళులర్పించారు. నందిగామ పట్టణంలోని ఎనిమిదోవ వార్డులో విశ్రాంత ఉపాధ్యాయులు దుగ్గిరాల చిన్నప్ప మాస్టారు మృతి చెందటంతో బుధవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు 
చిన్నప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి జయరాజు,ఎంవై దాసు, పి.శేఖర్ బాబు, అమ్మినేని జ్వాలా ప్రసాద్, పలువురు వైసిపి,టిడిపి నాయకులు,కాంగ్రెస్ నాయకులు కామా శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు,ఆర్సిఎం చర్చ్ పాదర్ ఎం. మరియదాసు, పాల్గొని నివాళులర్పించారు .