ప్రజాశక్తి - కశింకోట : మత సామరస్యానికి ప్రతీక గణతంత్ర దినోత్సవ వేడుకలు అని కశింకోట మండల పరిషత్ అధ్యక్షురాలు కలగా లక్ష్మి అన్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్ పి పి కలగా లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జాతీయ జెండా ను గౌరవించాలి అన్నారు ఎందరో మహానుభావులు త్యాగం నేడు ఈ వేడుకలో మనం ఉన్నాం అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు పెంటకొట జ్యోతి సర్పంచ్ లు కలగా గున్నయ నాయుడు, మంత్రి జయరజనీ ఎమ్ పి డి ఓ కొంకి అప్పారావు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు










