Jan 26,2023 12:02

ప్రజాశక్తి-రావికమతం : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పెదగరువు జీలు లోవా, అజయపురం ఆదివాసి గిరిజన గ్రామాల్లో 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘ ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి చంద్రయ్య మాట్లాడుతూ నేడు భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలు జరిగే రోజు నేటికీ 73 సంవత్సరాలు అవుతున్న నాన్సెజుల ఆదివాసి గిరిజనులకు రాజ్యాంగ పలాలు నేటికీ అందడం లేదన్నారు. అనకాపల్లి జిల్లా పరిధిలో 9 మండలాల్లో 113 రెవెన్యూ గ్రామాల్లో 50% పైగా ఆదివాసి గిరిజన గ్రామాలు 90 వేల మంది ఆదివాసి గిరిజనులు జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం గుర్తించి నేటికీ 46 ఆరు సంవత్సరాలు అవుతున్న నేటి కూడా 5వ షెడ్యూల్లో చేస్తామని ఎన్నికల్లో ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఆచరణలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అధికార పార్టీ ప్రతినిధులు కుమ్మక్కై గిరిజనులను భూమి నుండి ఖాళీ చేయిస్తున్నారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో నాన్ షెడ్యూల్ ఆదివాసి, గిరిజన గ్రామాలు ఉన్నాయని, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ప్రతిపాదన పంపించేందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నేటికి కూడా ఆన్ షెడ్యూల్ ప్రతిపాదన కాపీలు ప్రభుత్వానికి పంపించలేదన్నారు. నేటికీ గిరిజన గ్రామాల్లో స్కూల్, రోడ్డు సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. జ్వరం వచ్చిన, అనారోగ్యం వచ్చినా డోలీలు ద్వారా ఆసుపత్రి తీసుకెళ్లి పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 5వ షెడ్యూల్లో చేర్చాలని, రాజ్యాంగ ఫలాలు నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలకు వర్తింపచేయాలని గణతంత్ర దినోత్సవ సందర్భంగా  నినాదాలు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు. రాష్ట్ర కమిటీ సభ్యులు పి చంద్రయ్య. కిలో పొట్టి దొర, డిప్పల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.