
- పాఠ్యాంశాల తొలగింపుతో ప్రమాదంలో సృజనాత్మకత
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పాఠ్యాంశాలు తొలగించిన పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తొలగించాలని మరో 33 మంది విద్యావేత్తలు ఎన్‌సిఇఆర్‌టిని కోరారు. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎన్‌సిఇఆర్‌టి సలహాదారులు యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్షికర్ పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తొలగించాలని కోరారు. ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టరు దినేష్ ప్రసాద్ సక్లానీకి లేఖ రాసిన వారిలో అశోక విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్‌లర్, రాజకీయ శాస్త్రవేత్త ప్రతాప్ భాను మెహతా, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన రాధికా మీనన్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నివేదిత మీనన్, కాంతి ప్రసాద్ బాజ్‌పాయ్, నేషనల్ యూనివర్సిటీ సింగపూర్ వైస్-డీన్, జెఎన్‌యు మాజీ ప్రొఫెసర్ రాజీవ్ భార్గవ తదితరులు ఉనాురు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) పాఠ్యపుస్తకాల్లో మార్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠ్యపుస్తకాల అభివృద్ధి కమిటీలో భాగమైన 33 మంది విద్యావేత్తలు తమ పేర్లను ప్రస్తుత పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలనికౌన్సిల్‌ను కోరారు. నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సిఎఫ్) 2005 వెర్షన్ ఆధారంగా 2006-07లో రూపొందించిన పుస్తకాల కోసం పాఠ్యపుస్తకాల అభివృద్ధి కమిటీలో సభ్యులుగా ఉను 33 మంది రాజకీయ శాస్త్రవేత్తలు, ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యాంశాల తొలగింపు 'సృజనాత్మక సామూహిక ప్రయతాున్ని ప్రమాదంలో పడేసింది' అని పేర్కొన్నారు.
'ఎన్‌సిఇఆర్‌టి ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేస్తోంది. కొన్ని విభాగాలను (చాప్టర్లు కూడా) తీసివేయడం, ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ఉన్నాయి. ఏది ఆమోదయోగ్యం కాదో, ఏది కావాలో నిర్ణయించేది ఎవరు అనే నిర్ణయం పారదర్శకంగా లేదు. పారదర్శకత, పోటీ ప్రధాన సూత్రాలను ఉల్లంఘించాయి. విద్యా విషయక జ్ఞాన ఉత్పత్తికి ఆధారమని మేము విశ్వసిస్తున్నాము' అని పేర్కొన్నారు. 'అసలు పాఠ్యపుస్తకాల్లో అనేక ముఖ్యమైన పునర్విమర్శలు ఉనుందున, వాటిని వివిధ పుస్తకాలుగా రూపొందిస్తునుందున, ఇవి మేము తయారు చేసిన పుస్తకాలు అనిచెప్పుకోవడం, వాటితో మా పేర్లను అనుబంధించడం మాకుకష్టంగా ఉంది' అని విద్యావేత్తలు తెలిపారు. 'ఈ సృజనాత్మక సమిష్టి కృషి ప్రమాదంలో పడిందని మేము విశ్వసిస్తున్నాము. ఈ మార్పు పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తూ, ఎన్‌సిఇఆర్‌టి రాజకీయ శాస్త్ర పాఠ్యపుస్తకాల నుంచి పాఠ్యపుస్తక అభివృద్ధి కమిటీ సభ్యులుగా మా పేర్లను తొలగించాలని మేము మిమ్మలిు అభ్యర్థిస్తున్నాము' అని లేఖలో పేర్కొన్నారు. 33 మంది విద్యావేత్తలు తమ లేఖలో వివిధ కోణాలు, సైద్ధాంతిక నేపథ్యాల నుంచి రాజకీయ శాస్త్రవేత్తల మధ్య విస్తృతమైన చర్చలు, సహకారాల ఫలితంగా పాఠ్యపుస్తకాలు వచ్చాయని, భారతదేశ స్వాతంత్య్ర పోరాట ఆదర్శాలు, రాజ్యాంగ సభ ఆకాంక్షలు, సూత్రాల గురించి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్దేశించబడ్డాయని అన్నారు. మన రాజ్యాంగ క్రమం, నాయకులు, ఉద్యమాల పాత్ర, మన సమాఖ్య వ్యవస్థ స్వభావం, భారత ప్రజాస్వామ్య గణతంత్రం, చైతన్యవంతమైన లక్షణాలు ఉన్నాయని తెలిపారు.