
ప్రజాశక్తి రాంబిల్లి(అనకాపల్లి ) : ఈ రోజు రాంబిల్లి మండలం నేవీ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న 18T= PIT లో స్కంట్రాక్టర్ గా పని చేస్తున్న ఇండస్ట్రీయల్ సర్విసస్ లో గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆపరేటర్లు, మెకానిక్స్, డ్రైవర్లును ఉన్న ఫలంగా విధులు నుండి 28 మందిని నిలుపుదల చేయడం అన్యాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి దేముడునాయుడు అన్నారు. ఈ విషయమై యాజమాన్యం వెంటనే చర్య తీసుకోవాలని, అలాగే సెంట్రల్ లేబర్ కమీషనర్, లేబర్ అధికారులు జోక్యం చేసుకుని 28 మంది కార్మికులుకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసారు. ఈ కంపెనీలో గత 3 సంవత్సరాలుగా. రోజుకు 12 గంటలు చొప్పన డ్యూటీ చేయించారని, వీరికి కనీసం పిఎఫ్, ఈఎస్సి వంటి సౌకర్యాలు అమలు చెయ్యలేదని, బోనస్ ఇవ్వలేదని, అధిక పని చేయించుకొని OT అమలు చెయ్యద్దని అన్నారు. కనీసం కార్మికులుకు నోటీసులు కూడా ఇవ్వకుండా విదులు నుండి నిలుపు వేశారని వీరు ఎలా బతుకుతారని, దేవుడు నాయుడు స్థానిక ఎస్సై దీనబంద్ సమాచారం ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకలు. CH.నూకన్నా మరియు తొలగించిన కార్యక్రమాలు పాల్గొన్నారు.