
ప్రజాశక్తి-మైలవరం : రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకువచ్చిన 2.0 వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద మైలవరంలోని దస్తావేజు లేఖరులు పెన్డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవాధ్యక్షులు పగడాల సాంబశివరావు మాట్లాడుతూ పాత రిజిస్ట్రేషన్ విధానాన్ని కొనసాగించాలని, ప్రభుత్వం పెడుతున్న నిబంధనలను సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానవల్ల ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎంతో సమయం పడుతుందని, ఈ విధానం వల్ల అధికారులకు పనిభారం పని భారం తక్కువగా ఉంటుందని దస్తావేజులేఖర్లే రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియ అంతా చేయాల్సి వస్తుందన్నారు. ఈ విధానం వల్ల ఎన్నో ఎలుగా చేస్తున్న దస్తావేజు లేఖర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సబ్ రిజిస్టార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం దస్తావేజు లేఖరుల సంఘ సభ్యులు తొమ్మండ్రు సాంబశివరావు, యర మల ఉమామహేశ్వరి, టీ శేషాచారి, భాష, పత్తి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.