Sep 01,2022 14:24

ప్రజాశక్తి-మైలవరం టౌన్(ఎన్టీఆర్): రేషన్ బియ్యం(ration rice) అక్రమ రవాణాపై టీడీపీ నేడు రాష్ట్ర వ్యాప్త (TDP state wide) ఆందోళనలకు పిలుపునిచ్చింది. పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు(YCP leaders) అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట టీడీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలంటూ... నేడు మైలవరం పట్టణంలోని చౌక ధరల దుకాణం వద్ద నిరసన తెలిపి, అక్కడ నుండి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి MRO కార్యాలయం వద్ద  బైటాయించి నిరసన తెలియజేసిన అనంతరం టీడీపీ నేతలు MROకు వినతిపత్రం అందజేసారు.