
ఎన్టీఆర్: వైసిపి ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను తీసివేసి పేద వాళ్ళ పొట్ట కొట్టిందనిమాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జిల్లాలోని మైలవరంలో శనివారం టిడిపి కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడుతూ.... త్వరలోనే రాష్ట్రం అంతా అన్న క్యాంటీన్ లను తిరిగి ప్రారంభిస్తామన్నారు. టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్‌లను ఆపే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు. అన్న క్యాంటీన్ స్థలంలో భారీగా ప్రభుత్వ మద్యం సీసాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టె స్థలాలను మద్యం తాగే వారికి కేరఫ్ అడ్రస్‌లుగా మార్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో కల్తీ మద్యం తాగి చనిపోవడంపై ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. అన్న క్యాంటిన్ ప్రారంభానికి టిడిపి శ్రేణులు భారీగా తరలివచ్చారు.