ఎర్ర పుస్తకం ఎర్ర పుస్తకం
బతుకునే తెలుపు పుస్తకం
నడకనే మార్చు పుస్తకం
నడతనే నేర్పు పుస్తకం //ఎ//
జరిగే అన్యాయాన్ని
సూటిగా చెప్పు పుస్తకం
మదిలో ఆరాటాన్ని
మంచిగా మార్చు పుస్తకం
చెవిలో జోరీగల్ని
దూరానికి తరుము పుస్తకం //ఎ//
నిజాన్నే నిజమని
ధైర్యంగా తెలుపు పుస్తకం
అన్యాయాన్ని ఎదిరించమని
కర్తవ్యం చెప్పు పుస్తకం
జీవితాకే అర్థాన్ని
ఇచ్చులే ఎర్ర పుస్తకం //ఎ//
కష్టాల కడలినే
దాటించును ఈ పుస్తకం
కష్టానికి కారణమెవరో
చెప్పునే ఈ పుస్తకం
ఎదురొడ్డి నిలవమని
అండగా నిలుచు పుస్తకం //ఎ//
కనబడే దారుణాలకు
కారణం తెలుపు పుస్తకం
జీవితాన్ని అభ్యుదయంగా
మార్చునే ఈ పుస్తకం
కన్నెర్రగ చేయమనే
ధైర్యమే కద ఈ పుస్తకం //ఎ//
- జంధ్యాల రఘుబాబు










