Sep 16,2023 11:58

ప్రజాశక్తి - కశింకోట : కశింకోట మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలు కలగ లక్ష్మి గున్నయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతి పధకంలో అర్హులైన వారికి అందాలే చూడాలి అని అన్నారు.  సమస్యలు పరిష్కారం కోసం అధికారులు క్రుషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి దంతులూరి శ్రీధర్ రాజు, రాష్ట్ర వాటర్ వేస్ అధారిటీ చైర్మన్ దంతులూరి శ్రీధర్ రాజు, వాటర్ వేస్ అధారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, మండల ఉపాధ్యక్షులు పెంటకోట జ్యోతి శ్రీనివాసరావు, నమ్మి మీణా గణేష్, మండల అభివృద్ధి అధికారి వివి రవికుమార్, తాశీల్ధార్ సత్యనారాయణ సూపరింటెండెంట్ ఖాన్, సర్పంచ్ లు, ఎమ్ పి టి సి లు పాల్గొన్నారు.