ప్రజాశక్తి-చిత్తూరు : ఉద్యోగులు మంచి వాతావరణంలో పని చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో పాత ఆర్డిఓ కార్యాలయoలో నూతన హంగులతో రూ. 2.25 కోట్లతో నిర్మించిన ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవం, విఆర్ఓ రెవిన్యూ అసోసియేషన్ భవన నిర్మాణమునకు భూమి పూజలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భగనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చిత్తూరు ఎం పి ఎన్. రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్, చిత్తూరు ఎం ఎల్ ఏ ఆరణిశ్రీనివాసులుతో కలసి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కొరకు కృషి చేస్తున్నదని, ఉద్యోగులు ప్రశాంత వాతావరణంలో పని చేయడానికి అవసరమైన అన్ని అవకాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర అటవీ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉద్యోగులు కళ్ళులాంటి వారని, ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో ఉద్యోగుల పాత్ర ఉంటుందని, అటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక మంచి వాతావరణం కల్పించడం కోసం ఈ రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయబడిందని, సాధారణంగా ప్రజలకు ఎక్కువగా రెవిన్యూ కార్యాలయాలలో పని ఉంటుందని, ఈ పనులను చూసుకునేందుకు ఒక ప్రశాంతకరమైన వాతావరణంను ఈ కార్యాలయం ఏర్పాటు ద్వారా అందించినట్లు అయిందనన్నారు. చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డప్ప మాట్లాడుతూ... సాధారణంగా ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆర్ డి ఓ కార్యాలమునకు రావడం జరుగుతుందని, మంచి వాతావరణంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడానికి నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహాన్ మాట్లాడుతూ... ఏ పి పి ఎస్ సి గ్రూప్ 4 ద్వారా నియామక పత్రాలు అందుకున్న వారు విధి నిర్వహణ పట్ల బాధ్యతతో వ్యవహరించి ప్రజలకు సేవలను అందించాలని తెలిపారు. ఏ పి పి ఎస్ ఈ గ్రూప్-4 లో ఎంపిక కాబడి జిల్లాకు కేటాయించిన 66 మందికి నియామకపు పత్రాలను మంత్రులు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రులతో చిత్తూరు నగర మేయర్ అముద, డి ఆర్ ఓ ఎన్. రాజ శేఖర్, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహా దారు జ్ఞానేంద్ర రెడ్డి, రాష్ట్ర ఎ పి ఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయా నంద రెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ శాంతి,డిడి సోషల్ వెల్ఫేర్ రాజ్యలక్ష్మి, డిపిఓ లక్ష్మి, చిత్తూరు ఆర్డిఓ రేణుకా,జడ్పీ వైస్ చైర్మన్ ధ నుంజయ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లు కిరణ్మయి, లక్ష్మీ ప్రసన్న, కలెక్టరేట్ ఏ ఓ కుల శేఖర్, తహసీల్దార్ లు, రాష్ట్ర రెవిన్యూ సంఘం ఉపాధ్యక్షులు అమర్నాథ్, నగర డి ప్యూటీ మేయర్ లు రాజేష్ కుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, వి ఆర్ ఓ ల సంఘంజిల్లా అధ్యక్షులుబాలాజీ రెడ్డి,ప్రధానకార్యదర్శిపద్మనాభం,నాయకులు పల్లె వేడు చంద్ర శేఖర్, పోకల అశోక్ కుమార్, ప్రజా ప్రతినిధులు,రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










