- స్థలం కోసం ప్రభుత్వానికి ఆర్‌బిఐ దరఖాస్తు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : భారతీయ రిజర్వు బ్యారకు తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించింది. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు విశాఖలో అనువైన స్థలాన్ని లీజు పద్ధతిన కేటాయించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. పదేళ్ల పాటు తమకు స్థలం ఇవ్వాలని పేర్కొరది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లోనే రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ఉన్న సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ ప్రస్తుతం అక్కడి నురచే జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కొత్త ప్రారతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కనీసం 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించిన ప్రతిపాదనల్లో ఆర్‌బిఐ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి హైదరాబాద్‌లోనే సమావేశాలు, సమీక్షలు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి అధికారులు అక్కడికే వెళ్లాల్సి వస్తోరది. అరతే కాకుండా రాష్ట్ర ఆర్థికశాఖ నిర్వహిరచే సమావేశాలకు రిజర్వు బ్యారకు అధికారులు కూడా హైదరాబాద్ నుంచే విజయవాడకు రావాల్సి ఉరటోరది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ప్రయాణిరచాల్సి రావడంతో నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక ప్రారతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, అది కూడా విశాఖలో అయితే బావుంటుందని ఆర్‌బిఐ నిర్ణయించింది. త్వరలోనే రాజధానిని విశాఖకు తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో పునరుద్ఘాటించిన నేపథ్యంలో ఆర్‌బిఐ తన ప్రారతీయ కార్యాలయాన్ని కూడా విశాఖలోనే ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేయడం గమనార్హం.










