జైపూర్ : న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాత్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఆయన జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని అన్నారు. దీనిపై విమర్శలు రావడంతో న్యాయవ్యవస్థను ఎప్పుడూ గౌరవిస్తానని, నమ్ముతానని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుమోటోగా క్రిమినల్ ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై జస్టిస్ శ్రీవాస్తవ, జస్టిస్ అశుతోష్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి, సిఎంకు నోటీసులు జారీ చేసింది.










